నీటి యాజమాన్యం
సాధారణంగా రైతుల కలుపును అరికట్టడానికి నీళ్ళు ఎక్కువగా పెట్టి వుంచుతారు. కాలవల ప్రాంతాలలోనే కాకుండా చెరువులు, బోర్ల కింద కూడా పంటకు అవారం కన్నా నీటి వినియోగం ఎక్కువగా వుంది. నీళ్ళు నిలబడి వున్న నేలల్లో ఏమవుతుంది.?....గాలి ఆడక వరి వేళ్ళు ఆరోగ్యంగా పెరగవు.
అందుకే శ్రీ పద్ధతిలో పొలంలో నీళ్ళు నిలబడేలా పెట్టారు. పొలం తడిచేలా మాత్రమే పెడతారు. నేల సన్నటి నేర్రలుకొడుతున్న దశలో మళ్ళి నీళ్ళు పెట్టాలి. నేలను బట్టి వాతావరణం బట్టి ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టాల్సి వుంటుందో నిర్ణయించుకోవాలి.